National level karate tournament | కోల్ సిటీ, డిసెంబర్ 15: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోదావరిఖనికి చెందిన స్పార్క్ కుంగ్ ఫూ మా రుషల్ టిల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో చరణ్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ నేషనల్ కుంగ్ పూ అండ్ కరాటే పోటీలలో వివిధ రాష్టాల నుంచి మొత్తం 800 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో గోదావరిఖనిలో కరాటే మాస్టర్ ఎం. రాజేశం వద్ద శిక్షణ పొందిన 20 మంది విద్యార్థులు అత్యంత ప్రతిభను ప్రదర్శించారు. అండర్- 10 విభాగంలో శ్రీకరి వైద్విక గోల్డ్ మెడల్ సాధించగా, కే.యోగి, తన్విశ్రీ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే అండర్-12 విభాగంలో లాస్య (ద్వితీయ), సామన్విత, వైష్టనవి (తృతీయ), బాలుర విభాగంలో హర్ష వర్ధన్, హేమంతు, అక్యూషత్, సంజీవ్ వరుసగా ప్రథమ స్థానాల్లో నిలిచారు.
అండర్-14 విభాగంలో కే.నిహారిక, తేజశ్రీ, ఎండీ గౌస్, కార్తీకేయ ప్రథమ స్థానాలు సాధించినట్లు మాస్టర్ రాజేశం, జీ.నారాయణ, ఇన్స్ట్రక్టర్ కే.రాములు తెలిపారు. విజేతలను పోటీల నిర్వాహకులు మెడల్స్ తో అభినందించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించడం పట్ల పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.