Best Service Award | చిగురుమామిడి, ఆగస్టు 15 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో కరీంనగర్ లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పురస్కారాన్ని శుక్రవారం ప్రదానం చేశారు.
ఎస్సై సాయి కృష్ణ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విధి నిర్వహణలో అంకితభావంతో అనేక నేరాలను చేదించారు. వీరికి సేవా పురస్కారాన్ని అందించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.