Chigurumamidi | చిగురుమామిడి, డిసెంబర్ 24 : చిగురుమామిడి మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీతో గెలిచిన మహిళా సర్పంచ్ ఆచరణలో ముందుకు వెళ్ళింది. చిగురుమామిడి సర్పంచ్ గా ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకవరభవానీ బుధవారం గ్రామంలోని కోతులను పట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా 100కు పైగా కోతులను వాహనాల్లో అటవీ ప్రాంతానికి తరలించారు.
గ్రామంలో కోతులు లేకుండా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మొదటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సర్పంచ్ భవాని పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా గ్రామంలో కోతులతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంటి పైకాప్పులతో పాటు రేకులు ఇంట్లో సామాను ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందన్నారు.
చాలామందిపై కోతులు ఎదురుదాడికి దిగి గాయపరిచే సందర్భాలు ఉన్నాయని అన్నారు. కోతులను గ్రామంలో లేకుండా తీసుకున్న నిర్ణయం పట్ల సర్పంచిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.