Chakali Ailamma | చిగురుమామిడి, సెప్టెంబర్ 10 : చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మండలంలోని రేకొండ గ్రామంలో రజక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాచర్ల రంగయ్య, దుడ్డేల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్ల ఉద్యమం, భూస్వామ్య పెత్తందారుల విధానాలకు విరోచితంగా పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదని కొనియాడారు.
ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, వారి విగ్రహాలను ప్రతీ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అన్ని గ్రామాల్లో రజక సంఘం కమిటీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు దుడ్డేల సదానందం, కొత్తపల్లి పరశురాములు, నాంపల్లి శ్రీధర్, దుడ్డెల శ్రీనివాస్, రాజు, యాదగిరి, మున్నా రాజు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రజక సంఘం అధ్యక్షుడు దుడ్డెల లక్ష్మీనారాయణకు సంఘ నాయకులు నివాళులర్పించారు.