Voditela Sathish kumar | సింగరేణి కార్మిక గర్జనకు తరలిన చిగురుమామిడి బీఆర్ఎస్ శ్రేణులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు చిగురుమామిడి మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.
Voditela Sathish kumar | చిగురుమామిడి, అక్టోబర్ 14 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు చిగురుమామిడి మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మండలం నుండి వివిధ గ్రామాలకు చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో గోదావరిఖనికి బయలుదేరారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సరం ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ. 1.95 లక్షల వరకు బోనస్ అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ. 1.53 లక్షలకే పరిమితం చేయడంతో ఒక్కో కార్మికుడు సుమారు రూ. 42 వేల మేర నష్టపోతున్నారని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులపై వివక్ష చూపుతూ, ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే ఈ కార్మిక గర్జన సభను నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పోరాటానికి సర్కారు భయపడి దిగివచ్చిందని, సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలైన వారసత్వ ఉద్యోగాలు, కారుణ్య నియామకాలు, బోనస్ పెంపు, ఇంటి స్థలాలు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మామిడి అంజయ్య, కానుగంటి భూమిరెడ్డి, కత్తుల రమేష్, మిట్టపల్లి మల్లేశం, పెనుకుల తిరుపతి, పిల్లి వేణు, కలువల సంపత్ రెడ్డి, అన్నాడి మల్లికార్జున్ రెడ్డి,కాశబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

