దేశమంతా తెలంగాణ మోడల్
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, ఆపై కార్యాలయంలో నిర్వహించిన అమ్మవారి పూజలో పాల్గొన్నారు.
- మహారాష్ట్ర నుంచే మార్పు మొదలవ్వాలి
- ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్తాం
- తెలంగాణ పథకాలు దేశమంతా రావాలి
- అప్పటి వరకు పోరాడుతూనే ఉంటా
- బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
- నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ భవన్ ప్రారంభం
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, ఆపై కార్యాలయంలో నిర్వహించిన అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ భవన్లో నాగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్‌ను సీఎం కేసీఆర్ కూర్చోబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలకాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగాణ పథకాలు వివరిస్తామని, దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని స్పష్టం చేశారు.

నాగ్‌పూర్ తరువాత ఔరంగాబాద్, పుణెలోనూ పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీలు కేశవరావు, సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్‌రెడ్డి, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ అధినేత కేసీఆర్‌కు మరాఠా నాయకులు ఘన స్వాగతం పలికారు. నాగ్‌పూర్ పట్టణమంతా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా గులాబీ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

