Mayor Mahankali Swamy | కోల్ సిటీ, ఫిబ్రవరి 19 : మరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక జీఎం ఆఫీసు వద్ద గల శివాజీ విగ్రహానికి మేయర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహసానికి మారుపేరుగా ఛత్రపతి ప్రపంచ చరిత్రలో నిలిచారన్నారు. మొఘల్ సామ్రాజ్యంను ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యంను నెలకొల్పిన యోధుడని కొనియాడారు. ఆయన అవలంభించిన ధర్మ నిరతి, సర్వమత సమ భావన ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తి దాయకమని తెలిపారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, గట్ల రమేష్, సాంబమూర్తి, కొలని కవిత, నాగరాజు, కౌటం సతీష్, నాయకులు వేగోళపు శ్రీనివాస్, ఆరె కుల సంఘం నాయకులు సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.
అలాగే శివాజీ యూత్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. బీజేపీ నియోజక వర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై శివాజీ చూపిన సాహసం, ధర్మనీతి కోట్లాది భారతీయులకు ఆదర్శమన్నారు. భరత మాత కన్న ముద్దుబిడ్డ శివాజీ బాటలో నడవాలన్నారు. ఇక్కడ యువకులు సాయి, చిన్ను, సాయి గౌడ్, బబ్లూ, కార్తీక్, ఆకాష్, రోహిత్, సాయిచరణ్ తదితరులున్నారు. అలాగే 43వ డివిజన్లో వడ్లకొండ ఆకాష్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్పొరేటర్ అభ్యర్థి మద్దెల దినేశ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ డివిజన్ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ 396వ జయంతి వేడుకలు నిర్వహించారు. నాయకులు నాతరి రాయమల్లు, బొంకూరి మధు, మైస రాజేశ్ లు హాజరై శివాజీ చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ యాసర్ల చిరంజీవి, కవ్వంపల్లి సతీశ్, ఇరుగురాల కిష్టయ్య, ఆకునూరి బాల అంకుష్, గద్దల శశిభూషణ్, రవీందర్ కుమార్, బొచ్చు శంకర్, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, కాసిపాక రాజమౌళి, బాదె వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.