Gudipalli | పాలకుర్తి : పాలకుర్తి మండలం గుడిపల్లి గ్రామంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గత మూడురోజులుగా గ్రామంలోని గుట్టపై గల చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఏ సందర్భంగా కల్యాణోత్సవం అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలు రథంలో పెట్టి ఊరేగించారు. ఊరేగింపులో గ్రామ మహిళల కోలాటం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. వైభవంగా జరిగిన కార్యక్రమంలో గుడిపల్లి జయ్యారం పుట్నూరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.