బోయినపల్లి, జూన్ 26: హైదరాబాద్ బోట్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా చెన్నా డి సుధాకర్‌రావు బుధవారం ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే పదిసార్లు అధ్యక్షుడిగా గెలిచిన ఆయన, ఇప్పుడు పదోకొండోసారి కూడా ఎన్నికయ్యారు. హుస్సేన్‌సాగర్ వద్ద బోట్స్ క్లబ్ ప్రెసిడెంట్ పదవీకి ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడడంతో బో యినపల్లి మండలం కోరెం గ్రామానికి చెంది న మాజీ ఎమ్మెల్సీ,
మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెన్నాడి సుధాకర్రా వు నామినేషన్ దాఖలు చేశారు. సింగిల్ నా మినేషన్ దాఖలు కావడంతో ఆయనతోపా టు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సుధాకర్‌రావు మూ డుసార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలువగా.. ఎనిమిదిసార్లు ఏకగ్రీవంగా విజయం సాధించారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యుల కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.