హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ): జంట నగరాలకు తాగు నీరు అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాలు కాలుష్య నివారణకు తీసుకునే చర్యలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని హైకోర్టు తప్పుపట్టింది.ఈసారి కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వంతోపాటు ఇతర శాఖలకు సోమవారం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి కాలుష్య నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీసింది. నీటిపారుదలశాఖ, జలమండలి, పీసీబీకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయని, పక్షంలో జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది.