గంభీరావుపేట, ఫిబ్రవరి 27 : చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడంతో మూగజీవాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బస్టాండ్ పబ్లిక్ ట్యాప్ వద్ద ఓ మేక పడ్డ నరకయాతనే నిదర్శనంగా కనిపిస్తున్నది.
నల్లా నుంచి బయటకు వస్తున్న నీటి చుక్కలతో మేక తన దాహం తీర్చుకోడానికి ఇలా తండ్లాడింది. నేరుగా పైపునకు తన నోటిని అదిమి పెట్టి బొట్టు బొట్టును ఒడిసి పడుతూ గొంతు తడుపుకొన్నది.