Change Dussehra holiday | గోదావరిఖని : గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకోవడం సాధ్యం కానందున ప్రజల సమైక్యత సమగ్రత కోసం సింగరేణిలో దసరా సెలవును మార్పు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
మహాత్ముడి జయంతి రోజున మద్యం మాంసం తీసుకోవడం చట్ట విరుద్ధంగా ఉంటుందని ఈ కారణంగానే కార్మికులు కార్మిక కుటుంబాలు అక్టోబర్ రెండున తేదీన దసరా పండుగను జరుపుకోవడానికి ఇష్టపడడం లేదని 3న దసరా సెలవు ఇవ్వడం వల్ల అందరికీ సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అక్టోబర్ రెండున రెండు పీహెచ్డీలు ఉండడం వల్ల కార్మికులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుందని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సింగరేణి యజమాన్యం సెలవు మార్పు నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన కోరారు.