Rudrangi | రుద్రంగి, సెప్టెంబర్ 7: రుద్రంగి మండల కేంద్రంలో పలువురు బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదివారం పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎనుగందుల గంగారాజం భార్య లత ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని, మండల కేంద్రానికి చెందిన పరంకుశం శేషాద్రిల కుటుంబాన్ని నాయకులతో కలిసి నియోజకవర్గ ఇంచార్టు చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, నాయకులు మంచె రాజేశం, కంటెరెడ్డి, మాడిశెట్టి ఆనందం. తలారి నర్సయ్య, ఉప్పులూటి గణేష్, దయ్యాల నారాయణ, ఆకుల గంగాధర్, సింగారపు గంగాధర్, సింగారపు గంగారాజం, పెద్దులు, నరేష్, మణిదీప్, సుదర్శన్, మల్లేశం, మల్లయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.