RGUKT | వీణవంక, జూలై 5 : మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లగొండ నిఖిత బాసర ఆర్జీయూకేటీకి ఎంపికైనట్లు హెచ్ఎం సంపత్కుమారాచారి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నల్లగొండ నిఖిత ఇటీవల జరిగిన పదో తరగతి ఫలితాల్లో 562 మార్కులు సాధించి నియోజకవర్గంలో మొదటి స్థానం సాధించింది.
ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ ఫలితాల్లో నిఖిత ఎంపిక కావడంపట్ల హెచ్ఎం సంపత్కుమారాచారి, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో శ్రీధర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.