కమాన్‌చౌరస్తా, మే 9 : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి విజయఢంకా మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా అభ్యసించి, గణనీయమైన మారులు సాధించి మెరుగైన ఫలితాలను రాబట్టారన్నారు. అంకిత భావంతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారని తెలిపారు.
రెండో సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో పీ బిందు 990, బైపీసీలో జీ రోషిని 989, ఎంఈసీలో జీ ఈశ్వర్ తేజ 983, మొదటి సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో కే విశ్వహరితాజ్ 466, కే స్నిగ్ధ 466, కే అక్షయ 466, బైపీసీలో ఎం సిరివెన్నెల 435, ఎంఈసీలో టీ హారిక 479, సీఈసీలో జే ప్రశాంత్ 491 మారులు సాధించారని చెప్పారు. నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్ధేశంతో శ్రీచైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయని తెలిపారు. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేరాఫ్‌గా నిలవడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.