కరీంనగర్ కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 17 : ఐఐటీ జేఈఈ (మెయిన్స్)- 2026 మొదటి విడుత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్‌లోని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. తమ కళాశాలకు చెందిన సీహెచ్ లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. వీ శ్రేయాస్‌రెడ్డి 99.83, కే ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బీ లిఖిత్ సాయి 99.6, ఏ సత్య వర్ధన్ 99.6. జీ ఆశిష్‌రెడ్డి 99.53, ఎన్ రత్నప్రకాశ్ 99.38, బీ శ్రీహాన్ 99.27 యూ అభినవ్ధరి 99.25, ఎల్ ప్రణయ్‌రెడ్డి 99.13, వీ సుహాని 99.11 సాధించారని తెలిపారు.
99 పర్సంటైల్ ఆపై 12 మంది విద్యార్థులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. 90 పర్సంటైల్ ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషమని, రెండో విడుత ఫలితాల్లోనూ తమ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధ్యమైందన్నారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్స్), నీట్, ఎంసెట్‌లోనూ తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధిస్తారని చెప్పారు. ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపకులు, అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.