బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి చైన్ స్నాచింగ్
మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి వివరాలను మెట్పల్లి ఇన్చార్జి సీఐ రాజశేఖర్‌రాజు వెల్లడించారు
- వృద్ధురాలి మెడలోన బంగారు గొలుసు అపహరణ
- దొంగ అరెస్ట్, చైన్ స్వాధీనం
మెట్పల్లి, నవంబర్ 23: ఒంటరిగా రోడ్డుపై ఆటో కోసం వేచి ఉన్న ఓ వృద్ధ్దురాలికి లిప్ట్ ఇస్తామని చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి పట్టణంలో జరిగింది. మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి వివరాలను మెట్పల్లి ఇన్చార్జి సీఐ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. కథలాపూర్‌కు చెంది న వృద్ధురాలు పులికంత నాగమణి (65) మెట్‌పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో గల వీఆర్ఎం గార్డెన్లో తమ బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి రాత్రి సుమారు 8 గంటల ప్రాం తంలో రోడ్డుపైకి వచ్చి ఆటో కోసం ఎదురు చూ స్తుండగా గుర్తు తెలియని ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చారు.
మెట్పల్లి బస్టాండులో దింపుతామని మాయమాటలు చెప్పి నమ్మించి అమెను బైక్‌పై ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో బైక్‌ను ఆపి దాడి చేసి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని బైక్‌పై మెట్పల్లి వైపు పరారయ్యారు. బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ సధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు, స్థానికుల ఇచ్చిన సమాచారంతో దొంగతనానికి పాల్పడింది మెట్ల చిట్టాపూర్‌కు చెందిన కుంచపు ఓదయ్యగా గుర్తించి ఆదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి తులన్నర బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. వృద్ధ్దురాలిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన ఓదయ్యను ఆరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

