Chada Venkat Reddy | చిగురుమామిడి, జూలై 6 : చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లిలో సీపీఐ సీనియర్ నాయకులు దొంతరవేణి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాన్ని సోమవారం సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పరామర్శించారు. వెంకన్న సీపీఐకి అంకితభావంతో పనిచేస్తూ విధేయుడుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడని అన్నారు. గ్రామ కార్యదర్శి, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పార్టీ అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా అమలు చేసేవాడని కొనియాడారు.
వెంకన్న మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వీరి వెంట రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తేరాల సత్యనారాయణ, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య, మంద ఎల్లయ్య, ఎండి ఉస్మాన్ పాషా, ఎలగందుల రాజు, తాళ్లపల్లి చంద్రయ్య, బందెల శ్రీనివాస్, సింగిరెడ్డి బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.