Sultanabad | సుల్తానాబాద్, ఏప్రిల్ 18: సత్ సంప్రదాయ పరిరక్షణ సభ పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షన భారతదేశంలోని అనేకమంది పండితులకు శిక్షణ ఇచ్చిన మహనీయుడు శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస రఘునాథ ఆచార్యులవారని సుల్తానాబాద్ వికాస తరంగిణి కోఆర్డినేటర్ సాదుల సుగుణాకర్ అన్నారు. ఆచార్య రఘునాథచార్యుల శత తిరునక్షత్ర జయంతి వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
వికాస తరంగిణి ప్రజ్ఞ కోఆర్డినేటర్, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వనజ వెంకటరమణ దంపతుల నివాసంలో రఘునాథ చారుల వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఆయన ధర్మ పరిరక్షణ కోసం సంప్రదాయ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను, వారు రచించిన గ్రంథాలను ప్రస్తావిస్తూ ఆయన సేవలను కొనియాడారు.
రఘునాథ ఆచార్యుల వారి శతజయంతి ఉత్సవాల పురస్కరించుకొని ఈనెల 20న వరంగల్లో ఏర్పాటు చేస్తున్న సభలో చిన్న జీయర్ స్వామి వారు పాల్గొంటున్నారని పలువురు పండితులకు రఘునాథ చార్ల వారి పురస్కారాలను ప్రదానం చేస్తారని సుగుణాకర్ తెలిపారు అనంతరం పలువురు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నమనేని సప్న, సుగుణ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, సునీత, చిట్టక్క తదితరులు పాల్గొన్నారు.