జగిత్యాల/కోరుట్ల, మే 8 : పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోరుట్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బైక్ ర్యాలీ తీశారు. కొత్త బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి, పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టి సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కస్తూరి రమేశ్, జనరల్ సెక్రటరీ కొంపల్లి సురేశ్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీ సుతారి నవీన్‌కుమార్, ఫసీయొద్దీన్, లైబ్రరీ సెక్రటరీ మర్రిపల్లి గంగాధర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాసభక్తుల రాజశేఖర్, న్యాయవాదులు గండ్ర ప్రవీణ్‌కుమార్, తోకల రమేశ్, ఆడెపు వినోద్, గాంధారి శ్రీనివాస్, గోసికొండ సురేశ్, అల్లె రాము, బద్రి సృజన్, లావుడ్యా రాకేశ్, గణేశ్, వివేక్, శ్రీనివాస్, అనిల్, రాజు, రాజేందర్, రమేశ్, శివకుమార్ పాల్గొన్నారు.
అలాగే, జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో కాలనీవాసులు స్వీట్లు పంచిపెట్టి, పటాకులు కాల్చారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దాడులు చేసిన భారత సైన్యానికి అందరం అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధరూర్ క్యాంపు కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు. మారుతీనగర్, మే 7: భారతదేశ ఆర్మీ సిందూర్ ఆపరేషన్ విజయవంతం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినందున మెట్పల్లి పట్టణంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు తోపారపు నాగయ్య, చిన్నయ్య, మగ్గిడి సురేశ్, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.