CCTV Cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం.. గంగాధర ఎస్సై వంశీకృష్ణ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
CCTV Cameras | గంగాధర, మార్చి 20 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి సీసీ కెమెరాలు అవసరమని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు.
ప్రజల భద్రతను కాపాడడంలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేర సంఘటనలు జరిగినప్పుడు దర్యాప్తుకు సీసీ కెమెరాలు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ గ్రామ భద్రతను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు. సీసీ కెమెరాల నిర్వహణను సక్రమంగా కొనసాగిస్తూ, వాటి ద్వారా గ్రామంలో శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల మమతారాణి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

