కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్13 : కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి హైస్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్య ప్రవర్తనపై ఇన్చార్జి డీఈవో జనార్దన్రావు శుక్రవారం విచారణ చేపట్టారు. గురువారం ఓ ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే కాగా, ఈ విషయమై ఇన్చార్జి డీఈవో శుక్రవారం పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుది నివేదికను కలెక్టర్కు అందిస్తామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కూడా పాఠశాలలో విచారణ జరిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ వెంకటేశ్ తెలిపారు. తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని, వారు పాఠశాలకు వస్తే ఊరుకునేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.