Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 16 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన శ్రీరాముల వీరాచారి (40) కార్పెంటర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. చాలాకాలంగా వృత్తిపై ఆధారపడి వివిధ ప్రాంతాల్లో కార్పెంటర్ పనులకు వెళ్లేవాడని, కుటుంబ పోషణకు డబ్బులు సరిపోకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కూతుళ్లు కలరు. మృతుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, సర్పంచ్ బోయిని రమేష్ ప్రభుత్వాన్ని కోరారు.