వీర్నపల్లి జూన్ 29 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో వీర్నపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కంటి శిబిరాలు గిరిజన పల్లెలు, లంబాడి తండాల్లో వెలుగులు నింపుతున్నాయి. వారం పాటు నిర్వహిస్తుండగా, మొదటి రోజైన ఈ నెల 27న వీర్నపల్లి మండలకేంద్రంలో నిర్వహించారు. వీర్నపల్లి క్లస్టర్ పరిధిలో 8 గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలి రాగా, సభేరి ఐ హాస్పిటల్కు చెందిన సుమారు 20 మంది నిపుణులు పరీక్షలు చేశారు. 320 మంది పరీక్షలు చేయించుకున్నారు.
అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి సిఫారసు చేశారు. కాగా, సోమవారం మండలంలోని గర్జనపల్లిలో నిర్వహించగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకొని, కళ్లద్దాలను తీసుకున్నారు. ఈ శిబిరంలో 180 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కంటి వెలుగు శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు.