Dharmaram | ధర్మారం,మే 28 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఊరకుంట వద్ద ఓ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో ఓ చూడి గేదె మృతి చెందింది. దీంతో గేదె మరణంతో దానిని పెంచిన రైతుకు రూ.70 వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. బాధితుడు పాలగాని మల్లయ్య కథనం ప్రకారం.. మల్లయ్య కు రెండు పాడి గేదెలు ఉన్నాయి. రోజు వారి మాదిరిగానే గడ్డి మేపేందుకు ఊరు గేదెల మందలో గురువారం ఉదయం పంపించాడు. మందలో నుంచి వేరుగా వచ్చి గడ్డి మేస్తూ ఆ గేదె ఊరకుంట సమీపాన ఉన్న ఓ రైతు పొలంలో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లింది.
అక్కడ తక్కువ ఎత్తులో గద్దెపై ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను గేదె తన కొమ్ములతో తాకింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ కు విద్యుత్ సరఫరా ఉండడంతో దానిని తాకిన గేదె కరెంట్ షాక్ తో అక్కడకక్కడే మరణించింది. ట్రాన్స్ కో సిబ్బంది అప్రమత్తపై వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న పెంపకం దారుడైన రైతు మల్లయ్య అక్కడికి చేరుకొని రెండు నెలల్లో ఈనె సమయంలో తన చూడి గేదె మరణించడంతో తల్లడిల్లాడు. ఫ్రాన్స్ ఫార్మర్ గద్దె తక్కువ ఎత్తు ఉండడం వల్లనే తన గేదే దానిని తాకి కరెంటు షాక్ తో మరణించిందని వాపోయాడు. తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు మల్లయ్య అధికారులకు విజ్ఞప్తి చేశాడు.