Peddapally | జనవరి 26 వరకు బీటి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
జనవరి 26 వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే రోడ్డుకు రూ.99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రారంభించారు.
Peddapally | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 26 : జనవరి 26 వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే రోడ్డుకు రూ.99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వేచించి వేయించిన రోడ్లపై కేజీవీల్స్తో ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని రైతులు సహకరించాలని కోరారు.
రోడ్లపై కేజీ విల్ ట్రాక్టర్ నడిపినట్లైతే జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ విషయంపై సంబంధిత ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఎస్సై చంద్రకుమార్ కు సూచించారు. గ్రామంలో రెండు సీసీ రోడ్లు మంజూరు చేయించాలని సర్పంచ్ గుడుగుల సతీష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపల ప్రకాష్రావు, సర్పంచులు గుడుగుల సతీష్, ఉత్తమ కుమారి, ఉప సర్పంచులు. రామారావు, తిరుపతిరావు, నాయకులు. తిరుపతిరావు, సాగర్ రావు, సతీష్ ,రమేష్, మాధవరావు, రాములు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా అభ్యున్నతికి కృషి

జూలపల్లి : మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ తహసీల్దార్ వనజ, సర్పంచులు పాటకుల అనూష, పుల్లూరి ప్రశాంతి, దండె వెంకటేశం, తొగరు శ్రీనివాస్, నాంపల్లి సంపత్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాటుకుల అనిల్, ధూళికట్ట సింగిల్ విండో మాజీ చైర్మన్ పుల్లూరి వేణుగోపాలరావు, నాయకులు పెంట కిషోర్ మచ్చ యాదగిరి, బండి స్వామి, కొమ్మ పోశాలు బొజ్జ శ్రీనివాస్, మల్లారపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

