Former MLA Satish Kumar | చిగురుమామిడి, మే 23: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేశాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టలో శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
చిగురుమామిడి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందాలని అన్నారు. వీరి వెంట జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు కృష్ణమాచారి, మాజీ ఎంపీపీ ఆకవరం భవాని, నాయకులు కొమ్మెర మహేందర్ రెడ్డి, సన్నీల వెంకటేశం, ఆకవరం శివప్రసాద్, ఆనుమాన్ల సత్యనారాయణ, ముక్కెర సదానందం,కత్తుల రమేష్, దుడ్డేల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ దాత బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్ ను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అభినందించారు.
ఆలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ
శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. వారికి ఆలయం నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు హైదరాబాద్ యూసఫ్ గూడా మాజీ కార్పొరేటర్ గుర్రం మురళి గౌడ్ హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.