కోరుట్ల, జనవరి 30 : అధికారం ఉందని పెత్త నం చెలాయిస్తే ఊరుకోబోమని, తాటాకు సప్పుళ్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు బెదరని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో చేరితే కేసులు పెడతామని వేధింపులకు పాల్పడుతున్నారని, భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాగా మెలగాలే గానీ, రాజకీయాలను భ్రష్టు పట్టించవద్దని హితవు పలికా రు. కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోరుట్లలో ఇటీవల బీఆర్ఎస్లో చేరిన నాయకులను నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం, బెదిరింపులకు గు రి చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ ఇ లాంటి చౌకబారు రాజకీయాలు చేయలేదని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని అహంకారపూరితంగా వ్యవహరి స్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. యువతరానికి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని, బీఆర్ఎస్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో యువతరానికి అ ధిక సీట్లు కేటాయించామని చెప్పారు.
తమ పార్టీలోకి రావాలని ఎవరినీ బలవం తం చేయలేదని, అసత్య ఆరోపణలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎమ్మె ల్యే స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక సర్వే కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం లో 89 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని చెప్పిన విషయాన్ని ప్ర స్తావించారు. కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ నాయకుల అబద్ధాలను పటాపంచలు చే స్తూ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలు కురిపించిందని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, దేశానికి రోల్ మోడల్‌గా, ఐటీ రంగంలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు పాల్గొన్నారు.