కరీంనగర్ కార్పొరేషన్, జూలై 15 : చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీల మహాధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కరీంనగర్, హుజూరాబాద్‌తో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో వెళ్లారు.
కరీంనగర్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు బీసీ నాయకులు నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మానకొండూర్ నియోజకవర్గం నుంచి రసమయి బాలకిషన్, మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, రామగుండం నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తరలి వెళ్లారు.