వేములవాడ, ఏప్రిల్ 17: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే సభకు పార్టీ శ్రేణులు, నా యకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో తరలివ చ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. గోడలపై వాల్‌రైటింగ్ చేసి.. ప ట్టణంలో ద్విచక్ర వాహనాలపై తిరిగి సభకు రా వాలంటూ అన్నివర్గాల ప్రజలను గురువారం ఆహ్వానించారు.
అంతకు ముందు వేములవాడ లో చలో వరంగల్ సభ పోస్టర్‌ను ఆవిష్కరించి, వాహనాలకు అతికించి మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నా యకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, పార్టీ పట్టణ కా ర్యదర్శి క్రాంతికుమార్, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మండలాధ్యక్షులు మల్యాల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, నరాల శేఖర్, సిరిగిరి రామ్‌చందర్, నాయకులు రామతీర్థపు రాజు, నీలం శేఖర్, కొండ కనకయ్య, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, మంతెన సంతోష్, ఈర్లపల్లి రాజు, గోపు పరశురాములు, కృపాల్, ఇస్మాయిల్, కమలాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, పోతు అనిల్, ఫర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.