మల్యాల, అక్టోబర్ 13 : ‘నేను స్థానికుడిని. మీ బిడ్డను. మీకు ఏ కష్టమొచ్చినా అందుబాటులో ఉంటా. మీ సమస్యను పరిష్కరిస్తా. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చా రు. శుక్రవారం ఆయన మల్యాల మండలంలోని మ్యాడంపల్లి, మానాల, తక్కళ్లపల్లి, తాటిపల్లి, లంబాడిపల్లి, సర్వాపూర్, గుడిపేట గ్రామా ల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాల మధ్య ప్రజలు స్వాగతం పలుకగా, ఎమ్మెల్యే రవిశంకర్ ఇం టింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనని గెలిపించాలని అభ్యర్థించారు.
ఆయాచోట్ల ఆయ న మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే చొప్పదం డి ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ ఈ ప్రాంతం వాళ్లు కాదని, వాళ్లకు ప్రజా సమస్యలపై అవగాహనే లేదని విమర్శించారు. ఇప్పుడు కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు గ్రామాలకు వస్తున్నారని, వారి మా టలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. 3 గంటలు కరెంటిచ్చే కాంగ్రెసోళ్లు కావా లో..? లేదా 24 గంటలు కరెంటిచ్చే బీఆర్ఎస్ వా ళ్లు కావాలో..? ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. తనది ఇదే నియోజకవర్గమని, స్థానికుడిగా తనకు ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక్కో పంచాయతీకి 50 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలున్నా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని, తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెం దిందని, తొమ్మిదేళ్ల క్రితం ఎలా ఉన్నది? ఇప్పుడెలా ఉన్నది? ఓ సారి ఆలోచించాలని సూచించా రు. నాడు కరువునేలగా ఉన్న చొప్పదండి నియోజకవర్గం ఇప్పుడు ప్రాజెక్టులు, 24గంటల కరెంట్‌తో సస్యశ్యామలంగా మారి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండగట్టు క్షేత్రాన్ని యాదా ద్రి, తిరుమల తరహాలో మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆయన వెంట మల్యాల జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, సర్పంచు ల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, జిల్లా కోఆప్షన్ మెంబర్ సుభాన్ పాల్గొన్నారు.