BRS SIRICILLA | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 17 : వరంగల్లో ఈ నెల 27న బీఆర్ఎఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చక్రపాణి పిలుపునిచ్పారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబందించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు సిరిసిల్ల నుండి భారీ సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సభను విజయవంతం చేయడంలో భాగంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. ప్రతీ కార్యకర్త నేను సైతం కేసీఆర్ సభకు వస్తామంటూ నినదిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరినీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములను చేసే విధంగా కృషి చేస్తామన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందన్నారు. కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటూ స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు సిద్ధవుతున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు పని చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడురి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజి చైర్మన్ కళ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణాధ్యక్షురాలు బత్తుల వనజ, నాయకులు బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, సత్తార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.