కరీంనగర్ విద్యానగర్, జూలై 18: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపు జనాభా లెకల్లో స్పష్టత లేదని, కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజకీయంగా ఎదగాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మున్నూరుకాపు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్లో జరిగిన గ్రామ, పట్టణ అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల వారీగా మున్నూరుకాపు కులస్తుల లెకలను తామే తీసి బహిర్గతం చేస్తామన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కాపు కులస్తుల మీద దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాపు ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలతో ఏసీబీ దాడులు చేస్తూ జైల్లో పెడుతున్నారని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో మున్నూరుకాపు కులస్థులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం మున్నూరుకాపు కులగణన చేపట్టాలని, మంత్రివర్గంలో చోటు కల్పించాలని, మున్నూరుకాపు అధికారులపై దాడులు ఆపాలని, కాచిగూడ పరిధిలో ఉన్న విద్యార్థి వసతి గృహాన్ని ప్రభుత్వ ఆధీనం నుంచి తీసేసి ట్రస్ట్‌కు అప్పగించాలని తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తంరావు పటేల్, సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్లు చల్ల హరిశంకర్, జేఎన్ వెంకట్, బుక వేణుగోపాల్, జిల్లా గౌరవాధ్యక్షుడు గంగుల సుధాకర్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధా కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, సర్పంచుల ఫోరం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఉప్పుల అంజనీ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, పురుమల్ల శ్రీనివాస్, బొమ్మరాత్రి రాజేశం, నాయకులు మడ్లపల్లి శ్రీనివాస్, గంప వెంకన్న, ముప్పిడి సునీల్, సత్తినేని శ్రీనివాస్, బొల్లం లింగమూర్తి, సాయిని నరేందర్, బండారి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.