Vodithala Satish Kumar | చిగురుమామిడి, డిసెంబర్ 24 : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బరోపితం చేస్తూ అత్యధిక సీట్లను సాధించి సత్తా చాటాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హనుమకొండలోని తన తన నివాసంలో చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ కొంకట మౌనిక, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో చిగురుమామిడి మండలంలో ఊహించిన వాటికన్నా ఫలితాలు సాధించినట్లు చెప్పారు.
అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు లొంగకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లారని కొనియాడారు. బొమ్మనపల్లి లో సర్పంచ్ మౌనిక భారీ మెజారిటీతో గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గ్రామ కమిటీ, నాయకులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వీరి వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ సర్పంచ్ కొంకట రవీందర్, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.