ముస్తాబాద్, మార్చి 21: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను సంబురంగా జరుపుకొందామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 23న కేటీఆర్ నిర్వహించే సన్నాహక సమావేశానికి శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని వెల్లడించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేటీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ సరారుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు.
కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల మాజీ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, కోఆప్షన్ మాజీ సభ్యుడు సర్వర్పాషా, పార్టీ పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, పట్టణ మాజీ అధ్యక్షుడు గూడూరి భరత్, మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, నాయకులు తాళ్ల రాజు కంచం నర్సింలు, జాహింగిర్, కోడె శ్రీనివాస్,పల్లె సత్యం, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.