కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ దళం గర్జించింది. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసును ముడిపెట్టి చట్టవిరుద్ధంగా సిట్ విచారణ చేస్తుండడంపై భగ్గుమన్నది. అధినేతకు సంఘీభావంగా ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. పల్లె, పట్టణం అనేతేడా లేకుండా ఎక్కడ చూసినా దండుగా కదిలివచ్చిన నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలు చేతపట్టి బైక్‌ర్యాలీలు తీశారు. వివిధ రూపాల్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు తయారు చేసి శవయాత్రలు నిర్వహించారు.
కార్పొరేషన్/ కమాన్‌చౌరస్తా/ కరీంనగర్‌రూరల్ /హుజూరాబాద్/ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట/ సైదాపూర్/వీణవంక/ మానకొండూర్/ శంకరపట్నం/ చిగురుమామిడి/ గన్నేరువరం/ తిమ్మాపూర్/ చొప్పదండి/ కొత్తపల్లి/ రామడుగు/ గంగాధర, ఫిబ్రవరి 1: కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల మహేశ్, దూలం సంపత్, ఎడ్ల అశోక్, సోహన్‌సింగ్, చంద్రశేఖర్, బేజుగం మధు, శ్రీనివాస్‌రెడ్డి, లింగపల్లి సత్యనారాయణ, వసంతరావు, ఆరె రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక శ్రీనివాస్, యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు తిప్పనపల్లి ప్రకాశ్, పాకాల శ్రీకాంత్, అలవోని శ్రావణ్ కుమార్, కుమ్మరి శివరాం, బుద్దే శశాంక్, పాకాల సాయికృష్ణ, దేవునూరి ఆంజనేయులు, విక్రమ్, అక్షయ్, శ్రీకాంత్, మనోజ్, రాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, బొమ్మకల్ గ్రామంలోని గుంటూర్పల్లిలో సిట్ తీరుకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పొన్నం ఎల్లయ్య, వీ అంజయ్య, వీ శ్రీనివాస్, రాజయ్య, పీ తిరుపతి, టీ వేణు, వీ మల్లయ్య, డీ వీరయ్య, పీ శ్రీనివాస్, పీ నర్సింగం, పీ బాలయ్య, వీ మల్లాగౌడ్, డీ గంగయ్య, ఏ ధర్మయ్య, బీ బీరయ్య, గుంటూరుపల్లిలో తోట కిరణ్‌కుమార్, వెంగళదాసు శ్రీనివాస్, కాల్వ అశోక్, శంకర్, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. ఇరుకుల్లలో సర్పంచ్ బుర్ర రమేశ్‌గౌడ్, సర్వర్‌పాషా, ప్రసాద్, సంపత్ పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సమీపంలోని సిర్సపల్లి క్రాస్ రోడ్ నుంచి శాలపల్లి ఇందిరానగర్ వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. దాదాపు 2 వేల బైకులతో సుమారు 4 వేల మంది ర్యాలీ తీశారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలు భూపతిరెడ్డి, సుధీర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో ప్రధాన రోడ్డుపై రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాజీ సర్పంచులు తొగరు భిక్షపతి, కాసగోని నిరోషా-కిరణ్, మాజీ ఉప సర్పంచ్ వంగ రాము, బీఆర్ఎస్ నాయకులు రావుల సత్యం, తాడూరి మల్లేశ్, సుద్దాల వీరయ్య, నిమ్మల కుమారస్వామి, బోల్ల చంద్రమౌళి, మాడ్గుల రవి, సబ్బని వెంకట్, గంగారపు వెంకటస్వామి తదితరులు ఉన్నారు.
ఇల్లందకుంటలో రోడ్డుపై ధర్నా చేపట్టగా, వారిని ఎస్ఐ క్రాంతికుమార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ కేడీసీసీబీ వైస్ చైర్మన్లు కందాల కొమురెల్లి, ఉడుత వీరస్వామి, సర్పంచులు కుమారస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు దిలీప్‌రెడ్డి, రాజు, మహేందర్, మొగిలి, మాజీ ఎంపీటీసీ కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
సైదాపూర్ మండలం దుద్దనపల్లి, రాయికల్, అమ్మనగుర్తి, సర్వాయిపేట, ఎక్లాస్పూర్ గ్రామాల్లో రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ తీశారు. కొత్తబస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు చాడ ప్రకాశ్‌రెడ్డి, టీ రజినీకాంత్, ఎం చిరంజీవి, ఎం శ్రీకాంత్, పీ రవీందర్రావు పాల్గొన్నారు.
వీణవంకలోనూ ధర్నా చేశారు. చల్లూరులో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు ఆధ్వర్యంలో ధర్నా, దేశాయిపల్లిలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో, వల్భాపూర్‌లో సొసైటీ మాజీ డైరెక్టర్ కామిడి కావ్య- శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు సరోజన-రాజేంద్రప్రసాద్, జడల రమేశ్, గాజుల శంకర్, బావు సంపత్, తిరుపతిగౌడ్, గజ్జెల మొగిలయ్య, కుమార్ పాల్గొన్నారు.

మానకొండూర్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో పల్లెమీద చౌరస్తావద్ద రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, పారునంది కిషన్, వెన్నె అనిల్, నాయకులు గూడూరి సురేశ్, గుర్రం కిరణ్‌గౌడ్, శాతరాజు యాదగిరి, పురం అనిల్, పిట్టల మధు, గట్టు శ్రీధర్, రాయికంటి కిరణ్, గడ్డి గణేశ్, ఎండీ గౌస్, నెల్లి శంకర్, ఏరవేణి రాజు, గంజి శ్రీనివాస్, నామల శ్రీనివాస్ పాల్గొన్నారు.
శంకరపట్నంలో కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిగా పోలీసులు అడ్డుకున్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ జడ్పీటీసీలు లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పొద్దుటూరి సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ కొయ్యడ పరశురాములు, సర్పంచులు పూదరి రాజు, నెలవేని మహేశ్, మేడుదుల ఐలయ్య, తాళ్లపెల్లి మొగిలి, విద్యాసాగర్‌రావు, నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, మోత్కూరి సమ్మయ్య, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, గుర్రాల తిరుపతిరెడ్డి, మోరె శ్రీనివాస్, సుభాష్‌రెడ్డి, ఖాజాపాషా, మాడ రాజిరెడ్డి, చింతల శ్రీనివాస్, నూనె శ్రీనివాస్ పాల్గొన్నారు. బొమ్మనపల్లిలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కత్తుల రమేశ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఉప సర్పంచ్ కాసర్ల హరీశ్, మాజీ సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, నాయకులు దరిపల్లి సంపత్, వెంకటస్వామి, తోట శ్రీనివాస్, కొంకట కొమురయ్య, ముత్యాల కొమురయ్య, మ్యాదరవేణి ప్రవీణ్, రవి, కత్తుల ప్రశాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గాగిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కలువల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో, రామంచలో గ్రామాధ్యక్షుడు గిట్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో, నవాబ్ పేట్లో గ్రామాధ్యక్షుడు పిల్లి వేణు ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
గన్నేరువరంలో రోడ్డుపై ధర్నా చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, పార్టీ మండలాధ్యకురాలు నవీన, పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, ప్రభాకర్, వెంకటమల్లు, శ్రీనివాస్, చింటూ పాల్గొన్నారు.
అల్గునూర్ చౌరస్తాను దిగ్భందించారు. రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, పొన్నం అనిల్, పాశం అశోక్‌రెడ్డి, సల్ల మహేందర్, నోముల శ్రీనివాస్‌గౌడ్, వంతడుపుల సంపత్, బోయిని తిరుపతి, సర్పంచులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి మండలం కొలిమికుంట రాష్ట్ర రహదారిపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సుమారు 500 మందితో కలిసి బైక్ ర్యాలీ తీశారు. అనంతరం ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తిని సంపత్, సర్పంచులు బందారపు అజయ్ కుమార్, మామిడి రాజేశం, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ జడ్పీటీసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల సౌజన్య-వినయ్ కుమార్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆరేళ్లి చంద్రశేఖర్ గౌడ్, గడ్డం చుకారెడ్డి, మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్లు కొత్తూరు మహేశ్, మాడూరి శ్రీనివాస్, నలుమాచు రామకృష్ణ, మాజీ సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, నాయకులు స్వామిరెడ్డి, అజ్జు, జహీర్ పాల్గొన్నారు.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మీచినేని నవీన్ రావు, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు కంకణాల విజయేందర్ రెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, ద్యావ మధుసూదన్ రెడ్డి, తిరుపతి గౌడ్, రమేశ్, స్వామి, అబ్బాస్, రవీంద్రనాథ్ ఠాగూర్, నజీర్, పరశురాములు, మల్లయ్య, లక్ష్మీనారాయణ, రమేశ్, జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.
రామడుగులో పార్టీ మాజీ మండలాధ్యక్షుడు, గోపాల్రావుపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. నాగి శేఖర్, మామిడి తిరుపతి, చాడ చంద్రశేఖర్‌రెడ్డి, సైండ్ల కరుణాకర్, గడ్డం మోహన్‌రావు, చాడ ప్రభాకర్‌రెడ్డి, జవ్వాజి శేఖర్, పూడూరి మల్లేశం, దాసరి రాజేందర్‌రెడ్డి, చిలుముల ప్రభాకర్, శనిగరపు అర్జున్, అనిల్‌కుమార్, బండారి చరణ్, మొల్గూరి తిరుపతిగౌడ్, జూపాక మునీందర్, మడ్డి మనోజ్, శ్రీకాంత్‌రెడ్డి, తడగొండ రాజు పాల్గొన్నారు.
కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో రాస్తారోకో చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్ వైద తిరుపతి, నాయకులు తాండ్ర నరేశ్, రాచమల్ల సత్తయ్య, కూన నాగరాజు, తాండ్ర నారాయణ, రాచకొండ రవి, రాచమల్ల రాజిరెడ్డి, కోల రవి, తాండ్ర లస్మయ్య, తాండ్ర సుధాకర్, రాచమల్ల అశోక్ పాల్గొన్నారు.