గడపగడపకూ గులాబీ సేన
ప్రచారంలో కారు పార్టీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. ప్రతిపక్షాలకు అందనంత వేగంతో వెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ యంత్రాంగమంతా ఎన్నికల రణక్షేత్రంలో నిమగ్నమైంది.
- కారు జోరు.. ప్రచార హోరు..
- బీఆర్ఎస్ క్యాంపెయిన్‌కు విశేష స్పందన
- జనంతో మమేకమవుతున్న అభ్యర్థులు
- కార్నర్ మీటింగ్‌లు.. ర్యాలీలు
- ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు
- ఇంటింటికీ వెళ్లి మద్దతు కూడగడుతున్న శ్రేణులు
కరీంనగర్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) ;ప్రచారంలో కారు పార్టీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. ప్రతిపక్షాలకు అందనంత వేగంతో వెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ యంత్రాంగమంతా ఎన్నికల రణక్షేత్రంలో నిమగ్నమైంది. గడగడపనూ తడుతూ తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తున్నది. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో అభ్యర్థులు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌తో పాటు హుస్నాబాద్ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్ ప్రచారపర్వంలో తలమునకలయ్యారు. గల్లీల్లో కలియతిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మ్యానిఫెస్టో కరపత్రాలు పంచుతూ కారు పార్టీకి మద్దతివ్వాలని విజ్ఞప్తిచేస్తున్నారు. యువతతో కలిసి బైక్‌ర్యాలీలు తీస్తున్నారు. కార్నర్ మీటింగ్‌ల్లో తమదైన శైలీలో ప్రసంగిస్తూ ఆకట్టుకుంటున్నారు. చేసిన పనులు ఏకరువు పెడుతూ చేయబోయే పనులు, సమస్యల పరిష్కారంపై హామీలిస్తూ..ప్రత్యర్థులపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూ ముందుకుసాగుతున్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలో అందరి చూపు కారుపైపే ఉన్నది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ విజయం వైపు దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మానకొండూర్‌ను అభివృద్ధి చేసిన ఆయన గెలుపు నల్లేరుపై నడకే అన్న విధంగా మారింది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలహీనంగా ఉండడం కూడా రసమయికి కలిసి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ధూం ధాం కార్యక్రమంతో తన మాటా, పాటలతో ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకండూర్ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ 2014 ఎన్నికల్లో రసమయి బాలకిషన్‌కు మానకొండూర్ టికెట్ కేటాయించి కళాకారులపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రసమయి ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌పై ఘన విజయం సాధించారు. అంతే కాకుండా, నియోజకవర్గంలోని ప్రజలకు చేరువగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రసమయికి 2018లో కూడా కేసీఆర్ తిరిగి టికెట్ ఇచ్చారు. కేసీఆర్ ప్రోత్సాహంతో ఆయన చేసిన అభివృద్ధి పనుల కారణంగా రెండో సారి కూడా రసమయి ఘన విజయాన్ని సాధించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రసమయి నియోజకవర్గాన్ని శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేసి చూపించారు.
అభివృద్ధే ఆయన మంత్రం
ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా, అడ్డంకు లు కల్పించినా లెక్క చేయకుండా మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే రసమయి బాలకిషన్ దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చి నియోజకవర్గా న్ని అభివృద్ధి చేశారు. 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గానికి మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్ ప్రాతినిథ్యం వహించారు. అప్పుడు ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా పని చేశారు. ఆయన హయాంలో అభివృద్దికి నోచుకోని మానకొండూర్‌ను రసమ యి బాలకిషన్ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందు నిలిపారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఆయన నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. అభివృద్ధి, సం క్షేమం మాత్రమే తన లక్ష్యమని ముందుకు సాగా రు. మూడు జిల్లాల పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజలను, నాయకులను ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిన రసమయిపై ప్రత్యర్థులు ఎన్ని ఎత్తు లు వేసినా తిప్పి కొడుతూ ప్రజలు రెండుసార్లు ఆయన వైపే మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో కూ డా ఆయనకు సరితూగే అభ్యర్థి కనిపించడం లేద ని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మళ్లీ రసమయికే పట్టం కట్టాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు.
ఎన్నికలప్పుడే ప్రజల్లోకి ప్రత్యర్థులు
రసమయి బాలకిషన్ మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ప్రజల మధ్యనే గడుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీలో ఉన్న నాయకులకు ఇందుకు భిన్నంగా ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని నిత్యం ప్రజల మధ్య ఉం డే నాయకుడిగా రసమయికి పేరుంది. గతంలో ఏ ఎమ్మెల్యేను చూసినా ప్రభుత్వ లబ్ధిదారులను తమ వద్దకు పిలిపించుకుని ప్రయోజనాలు అం దించే వారు. కానీ, రసమయి అందుకు భిన్నంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రైతుబీమా, గృహలక్ష్మి వంటి ప్రొసీడింగ్స్ అందించేందుకు రసమయి పొద్దుపొడుపు కార్యక్రమంతో ఆయా గ్రామాలకు వెళ్లి అందించ డం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు అతనికి కొండంత బలాన్ని అందిస్తోంది. ఓట్లపుడే కాకుండా ప్రజల ఇంటికి వెళ్లి చెక్కులు, ప్రొసీడింగ్‌లు అందించిన విషయాన్ని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత మంచి సేవ లు ఏ ఎమ్మెల్యే అందించలేదని, భవిష్యత్తులో వచ్చే నాయకులు కూడా ఈ విధంగా తమకు సేవ లు అందించ లేరని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూ..
రెండు పర్యాయాలు అంటే దశాబ్ధ కాలంగా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకగా వ్యవహరిస్తున్న రసమయిపై ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. ఆయన మరోసారి గెలుస్తున్నాడనే భయంతోనే ప్రత్యర్థులు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని పలువురు నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజీల కోసం డిమాండ్ చేస్తున్న కొన్ని పత్రికలు అందుకు అంగీకరించని పక్షంలో తప్పుడు కథనాలు రాసి తమ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి కథనాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మానకొండూర్‌లో హ్యాట్రిక్ విజయం సాధించేది రసమయి బాలకిషనే అనే విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

