Vemulawada | వేములవాడ, జూన్ 12: వేములవాడ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమ్మేళనం వేములవాడ పట్టణంలో శనివారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సమ్మేళనానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జీవన్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ హాజరవుతున్న క్రమంలో శుక్రవారం మహారాజా ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు తోట ఆగయ్య, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ గూడూరి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.
సభ్యత్వ నమోదు, సర్ పై శిక్షణ తరగతులు, పార్టీ బలోపేతంపై నాయకులకు దశ దిశ నిర్దేశించనున్నారు. సుమారు 800 మంది కార్యకర్తలు హాజరవుతున్న క్రమంలో ఇందుకు చేయాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కందుల క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, రాఘవరెడ్డి, నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కొండ కనకయ్య, ప్రేమ్ చారి తదితరులు పాల్గొన్నారు.