గోదావరిఖని, మే 14: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, ప్రజలంతా ఉద్యమ పార్టీ వైపే నిలిచారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టి ఏ ఒక్కటీ అమ లు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌పై ప్రజ లు కోపంతో ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆ మార్పు కోరుకొని తీర్పు ఇచ్చారని భావిస్తున్నానని చెప్పారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమైందని, దీనిని ప్రజలు ఓటు రూపంలో చూపించారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకున్న ఫలితాలు వచ్చి గెలుపు సాధించే అవకాశమున్నదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో ముందుకెళ్లామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎటూ పోలేదన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఓట్లే చీలిపోయి, ఆ మేరకు కాంగ్రెస్ ఓట్లు కొన్ని బీజేపీకి పడి ఉంటాయన్నారు. వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపులో ప్రజా ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచినట్లయితే రాష్ట్ర సర్కారు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా పోరాటం చేస్తానని, సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రజల పక్షాన నిలబడతానని, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం, రైతాంగం సమస్యలపై నిరంతరం రపోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తన కోసం కార్యకర్తలు కలిసికట్టుగా పని చేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ప్రజలు విసుగు చెందారని, అనే క హామీలు ఇచ్చి మోసం చేయడంతో అసంతృప్తి కనిపించిందన్నారు. కొప్పుల ఈశ్వర్ విజయం దాదాపు ఖాయమైనట్లేనన్నారు. సమావేశంలో నాయకులు మిర్యాల రాజిరెడ్డి, అభిషేక్ రావు, పెంట రాజేశ్, కుమ్మరి శ్రీనివాస్, కృష్ణవేణి, కవి తా సరోజని, చిప్ప రాజేశం, మారుతి, బొడ్డు రవీందర్, కిషన్, మురళీధర్, గోపు ఐలయ్య, పీటీ స్వామి, శ్రీనివాస రావు, జావిద్ పాషా ఉన్నారు.