వీణవంక, అక్టోబర్ 19: ఒక్కసారి ఆశీర్వదించండి .. రూ.వెయ్యి కోట్లు తెచ్చి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీణవంక మండలంలోని నర్సింహులపల్లి, కోర్కల్, దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి, లస్మక్కపల్లి, కనపర్తి, బేతిగల్, నర్సింగాపూర్, వల్భాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని, హుజూరాబాద్‌లో కూడా గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచులు మర్రి వరలక్ష్మి-స్వామి, దాసారపు సుజాత-లక్ష్మణ్, పర్లపెల్లి రమేశ్, మోరె సారయ్య, ఎంపీటీసీలు సంగ స్వరూప-సమ్మయ్య, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు సంది సమ్మిరెడ్డి, రాజయ్య, శశికుమార్, నాయకులు సంపత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గంగారెడ్డి, మేకల శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల రమేశ్, శనిగరపు గోపి, బండారి రవి, ముద్దసాని శ్రీనివాస్, దూలం శ్రీనివాస్, రఘురామ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, దూలం గోపి, కోమల్‌రెడ్డి, గుమ్మడి సంపత్, పూదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, అక్టోబర్ 19: జమ్మికుంట పట్టణంలోని 5, 6, 17, 18, 19, 20 వార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి గురువారం పర్యటించారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.