కొత్తపల్లి, నవంబర్ 14 : ఆంధ్రోళ్లు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమైన్రు. ఇప్పుడు జరిగే ఎన్నిక ఆంధ్రోళ్లకు మనకు జరిగే యుద్ధం లాంటిదే.. ఏ ఒక్క తప్పు జరిగినా మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది. సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.” అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తపల్లి మండలం మలాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో మంగళవారం ఉదయం, సాయంత్రం కరీంనగర్‌లోని 33, 34, 35 డివిజన్లలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించగా మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీకి వెళ్తాయని అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తపల్లి మండలం మలాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించగా మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గడపగడపకూ వెళ్లి ప్రచారం చేశారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనకు నాలుగోసారి విజయం అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ను గెలిపిస్తే మాయమై నాలుగున్నరేళ్లుగా ప్రజలకు చేసిందేమీ లేదని, ఒక రోజు కూడా గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగ పార్టీలని, వారికి పవిత్రమైన ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. సమైక్య పాలనలో మలాపూర్ అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. ఆంధ్రోళ్లే ముఖ్యమంత్రులు కావడంతో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైందన్నారు.
స్వయం పాలనలో కరీంనగర్‌ను గొప్పగా అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే వచ్చే పదవులతో మరింత సేవ చేస్తానన్నారు. పచ్చని తెలంగాణను చూస్తే ఆంధ్రోళ్ళకు కంటగింపుగా ఉందని, ఢిల్లీ పార్టీలతో కుమ్మకై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న కేసీఆర్ చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుందని మోసపోతే గోసపడక తప్పదని హెచ్చరించారు. తనను నాలుగోసారి గెలిపించి ఐదేళ్ల పాటు సేవ చేసుకొనే భాగ్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ గొట్టె జ్యోతి పోచయ్య, ఎంపీటీసీ పండుగ గంగమ్మ నర్సయ్య, బీఆర్ఎస్ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఉప సర్పంచ్ కాసారపు గణేశ్‌గౌడ్, వ్యవసాయ మారెట్ కమిటీ డైరెక్టర్ గంగాధర లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ బొమ్మ ఈశ్వర్‌గౌడ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పెరుమళ్ళ జనార్ధన్, సీనియర్ నాయకులు ఒల్లాల మల్లేశం, శ్రీనివాస్, జగన్‌రెడ్డి, పల్లె రవీందర్‌గౌడ్, గొల్లపల్లి వెంకటేష్, భారత్, అరుణ్ పాల్గొన్నారు.