మంథని, అక్టోబర్ 19: పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచితస్థానం కల్పిస్తామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు. కొత్తపాత అనే తేడాలేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సైనికుల్లా పనిచేసి మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మల్హర్ మండలం తాడిచర్లకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు కారుపాకల శంకర్, ఆకుల నారాయణ, బువనగిరి శంకర్, ఆకుల విజయ్‌కుమార్, ఆకుల నారాయణ,
కరుపాకల ఓదెలు, పిట్టల రాజయ్య, సుంకరి చంద్రయ్య, గోసుకుల సమ్మయ్య, నోతి శ్రీనివాస్‌తో పాటు మరో 20 మంది, మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీకే) గ్రామానికి చెందిన సుమారు 20 మంది వివిధ పార్టీల నేతలు గురువారం బీఆర్ఎస్లో చేశారు. వీరికి మంథనిలోని రాజగృహలో పుట్ట మధు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆనంతరం మాట్లాడుతూ యావత్ దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని పేర్కొన్నారు.