Timmapur | మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
Timmapur | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇటీవల జరిగిన సర్పంచుల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హామిని నిలబెట్టుకున్నారు.
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇటీవల జరిగిన సర్పంచుల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హామిని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ( Ravula Ramesh ) ప్రజలకు హామీ ఇచ్చారు.
మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ తిరుపతి గెలవగా ఆ గ్రామంలో వాటర్ కూలింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి బుధవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కేవలం మెయింటెన్స్ ఖర్చులు తీసుకుని కూల్ వాటర్ ( Cool Water ) గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. మిగతా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాట్ల తిరుపతి, ఉప సర్పంచ్ మేకల మహేష్, నాయకులు పాశం అశోక్ రెడ్డి, సమ్మయ్య, సతీష్, పరశురాములు, రవి, శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

