BRS leaders | సిరిసిల్ల రూరల్, జూలై 4: తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా కళాశాలలోనీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మొదటిరోజు సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై ధర్నా చేయగా, కలెక్టర్, ఉన్నతాధికారులు రాకపోవడంతో గురువారం కూడా కళాశాలలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ మేరకు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు, మాజీ మహిళా ప్రజా ప్రతినిధులు కళాశాలకు సందర్శనకు శుక్రవారం వెళ్లారు. బీఆర్ఎస్ నేతల రాకతో పొందస్తుగానే గేట్ కి తాళం వేశారు. కళాశాలలోకి నేతలను ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వలేదు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది కూడా అనుమతికి నిరాకరించారు. రెండు గంటల పాటు వేచి ఉండి, అనంతరం విలేకరుల తో మాట్లాడారు. తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సి కళాశాలలో ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ కు మెటీరియల్ లేదని, ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు రోడ్డెక్కిన అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు, ప్రభుత్వానికి చేతకాక పోతే విరాళాల ద్వారా కాని, తమ నాయకుడు కేటీఆర్ ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గురుకుల, వెల్పేర్ కళాశాలలో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 24 గంట లో సమస్యలు పరిష్కారం చేయకపోతే, బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, మాజీ ఎంపీపీ పడిగెల మానస, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఏఎంసీ చైర్ పర్సన్ పూస పల్లి సరస్వతి, మాజీ సర్పంచ్లు అంకారపు అనిత, కొడం సంధ్యారాణి, మాజీ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నంద గిరిభాస్కర్ గౌడ్, పడిగెల రాజు, బండి జగన్, క్యారమ్ జగత్, అమర్ రావు, భిక్షపతి, తిరుపతి, నవీన్ రావు, కుర్మ రాజయ్య, ఆఫ్రోజ్, తవు టు శివ, విజయ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.