Kunaram | కాల్వ శ్రీరాంపూర్, జనవరి 27 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన నారగోని రాములు అనే గీత కార్మికుడు ఇటీవల తాటి చెట్టు నుండి పై పడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సందర్భంగా గీత కార్మికుడిని మంగళవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
ఇక్కడ సర్పంచ్ మంతిని రాజయ్య, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రమ రాజమల్లు, గౌడ సంఘం అధ్యక్షుడు కోడూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుర్ర ఐలయ్య, గౌడ సంఘం నాయకులు ఇల్లందుల రాములు, సుద్దాల శ్రీనివాస్, నారగోని లక్ష్మణ్, ఆరెల్లి కుమార్, నారగోని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.