కోనరావుపేట : యూరియా బస్తాలు లేక రైతులు అల్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కోనరావుపేట మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య అన్నారు. యూరియా కొరతను తీర్చాలని రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూరియా కొరుతతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తుంటే పాలకులు కొరత లేదని చెప్పడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారన్నారు. సకాలంలో రైతుబంధు అందక ఎరువులు లేక అష్టకష్టాలు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఏ సమయంలో ఏమీ కావాలో అవగాహన లేక ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. అబద్దాల మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. మూడు నెలలు గడిచినా రైతులకు బోనస్ ఇవ్వలదేన్నారు. రైతులకు యూరియా కొరత తీర్చడంతో పాటు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.