Koppula Eswar | ధర్మారం, జనవరి 27: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాలలో ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు హాజరుకావాలని ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు. బొట్ల వనపర్తి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో జరిగే ఇట్టి జాతర ఉత్సవాలకు హాజరై సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవాలని కోరుతూ పార్టీ నాయకులు ఆయనకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. జాతర ఉత్సవాల పోస్టర్లను ఆయనతో ఆవిష్కరణ చేయించారు.
ఇక్కడ పెట్టిన నంది మేడారం ప్యాక్స్ మాజీ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, బొట్లవనపర్తి మాజీ సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రామయ్య, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మోర కొమురయ్య, పార్టీ యూత్ నాయకుడు ఆకారి సత్యం ,వార్డు సభ్యులు రెడపాక లక్ష్మణ్, మాజీ వార్డు సభ్యుడు రెడపాక పోషయ్య, స్థానికులు ఆకారి రాజిరెడ్డి రెడపాక నర్సయ్య, ఎర్రగుంటపల్లి సమ్మక్క జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ ఎల్లాల చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ ఆవుల లచ్చయ్య, కమిటి సభ్యులు దేవి మల్లేశం, దామరపెల్లి వెంకటేష్, కొడిచెర్ల రాజు, చిప్ప నరేష్, యువ నాయకులు కస్తూరి రాజు, అల్లం శ్రీశైలం పాల్గొన్నారు.