Chigurumamidi | చిగురుమామిడి, జూలై 24: చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఎలుక పెళ్లి కనకరాజు, ఎనగందుల నవ్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం శుక్రవారం అందజేశారు. వీరి వెంట వార్డు సభ్యులు పెసరి రాధాకృష్ణ, రాధాకృష్ణ, పెసరీ ప్రమీల, కావటి మంజుల, మంతిని ప్రియాంక, కాశబోయిన రమేష్, ఎలుకపెళ్లి శ్రీనివాస్, లలిత, వెంకటస్వామి, ఎల్లవ్వ, శ్రీనివాస్, అనిల్, మహేందర్ తదితరులున్నారు.