Koppula Eshwar | ధర్మారం, జనవరి 1 : రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కరీంనగర్ శ్రీపురం కాలనీలో ని ఆయన స్వగృహానికి పార్టీ నాయకులు గురువారం వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ,గుర్రం మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ నాయకులు ఎగ్గేల స్వామి, అయిత వెంకటస్వామి, కోరుకంటి స్వామి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.