Thimmapur | తిమ్మాపూర్, సెప్టెంబర్ 7 : మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దహనం చేసి, అనుచిత వాఖ్యలకు నిరసనగా కవ్వంపల్లి దిష్టిబొమ్మను రాజీవ్ రహదారిపై కాల్చి, పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం మాట్లాడారు. డాక్టర్ వృత్తి నుండి వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి భాష ఇదేనా అని ప్రశ్నించారు. రసమయి బాలకిషన్ ఇసుక దందా ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు కాలుస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏం లేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోయే సీటు కవ్వంపల్లిదేనని స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సుమారు వందకు పైగా దరఖాస్తులను ప్రజావాణిలో అందజేశారు. అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కి, ఇప్పుడు ప్రజలను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో పాశం అశోక్‌రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, వంతడుపుల సంపత్, నోముల రాజేష్ గౌడ్, తిరుపతిగౌడ్, సంగుపట్ల మల్లేశం, కొయ్యడ మురళీ, కొండ్ర రాజు, దాడి ఓదెలు, గూడ తిరుపతి, బొర్ర రవీందర్, రంగు కార్తీక్, గడ్డి రమేష్, సుధగోని సదయ్య తదితరులు పాల్గొన్నారు.